'అల్లుఅర్జున్ ఆన్ లైన్ డాట్ కామ్' వెబ్ సైట్ ప్రారంభించిన పూరీ
'ఇద్దరమ్మాయిలతో..' ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ముగిసింది. చివర్లో హీరో అల్లు అర్జున్ మాట్లాడుతూ, సినిమా కోసం పాటు పడిన ప్రతి టెక్నీషియన్ కూ కృతజ్ఞతలు తెలిపాడు. అభిమానుల ఆదరణే తమను ఇంతటి వాళ్ళను చేసిందని చెప్పాడు. ఎంతో మంది శ్రమిస్తే ఒక్క హీరోకే పేరొస్తుందని, ఆ క్రెడిట్ అందరికీ దక్కాలని అభిప్రాయపడ్డాడు. కాగా, అభిమానుల కోసం 'అల్లుఅర్జున్ ఆన్ లైన్ డాట్ కామ్' పేరిట వెబ్ సైట్ ను పూరి జగన్నాథ్ చేతుల మీదుగా ఆరంభించాడు.